కౌతాళం : మండల కేంద్రంలో వినాయక పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దాదాపు కౌతాళంలో 50 నుంచి 60 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇవాళ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సర్పంచ్ పాల్ దినకరన్ శుక్రవారం పరిశీలించారు. ఏ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహ మండపాల నిర్వాహకులు వీలైనంత త్వరగా నిమజ్జనానికి గణనాథులను తీసుకురావాలని సూచించారు.