శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం జలమయమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కనీసం కాళ్ళు కూడా పెట్టడానికి వీలు లేకుండా కాంప్లెక్స్ మొత్తం నీరుతో నిండిపోవడంతో ప్రయాణికులు నీటిలోనే వెళ్లి బస్సులు ఎక్కారు.