సంగారెడ్డిలో శనివారం ఆర్టీసీ డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 14 మంది తమ సమస్యలను ఆర్టీసీ డిఎం ఉపేందర్ కు విన్నవించారు. ముఖ్యంగా, గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు నడపాలని పలువురు కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని డిఎం ఉపేందర్ హామీ ఇచ్చారు.