గత వైసీపీ ప్రభుత్వం లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాదిగ కార్పోరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం సందర్శించారు. ఈసందర్భంగా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తులసీ దేవి, దళిత సంఘల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి దారి మల్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుక