అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో శుక్రవారం అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. వినాయక చవితిని పరిష్కరించుకుని వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం మూడవరోజు వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఆయా ప్రాంతాలలో చేపట్టారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బరి బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా మూడు రోజులపాటు వినాయకుని చేతిలో పూజ చేసిన లడ్డూలను వేలం పాటలు నిర్వహించారు. గుర్రంకొండ పట్టణంలోని బలిజగడ్డ వీధిలోని వినాయకుని చేతిలోని లడ్డూ 38,000 రూపాయలకు,ఇందిరమ్మ కాలనీ వినాయకుని లడ్డూ 50వేల రూపాయలకు దినేష్ కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు జగదీష్ తెలిపారు