జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై గానుగుపహాడ్ వద్ద వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకపోవడంతో గానుగు పహాడ్ గ్రామంలో నుండి భారీ వాహనాలు వెళుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు, బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని,వెంటనే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు.