శ్రీకాకుళం పరిధిలోని పెదపాడు రోడ్డు మైస్టోర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..ఈ ఘటనలో తీవ్ర గాయాలైన గంగరాజు అనే వ్యక్తి రిమ్స్ లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళంలోని బజాజ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్నాడు. ఈయన అవివాహితుడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.