ప్రభుత్వ ఆసుపత్రి లోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయని,అలాగే ప్రభుత్వ పాఠశాల లోనే ఉన్నతమైన విద్య ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.బుధవారం బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటించారు.ముందుగా మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఇప్పటివరకు జరిగిన యూరియా అమ్మకాలను,అలాగే ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలను అమ్ముతున్నారో పరిశీలించి యూరియా తీసుకెళ్లిన ఒక రైతుకు వ్యవసాయ అధికారి ద్వారా ఫోన్ చేపించి యూరియా కొనుగోలు మీద అభిప్రాయం తెలుసుకున్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కి కలెక్టర్ వెళ్ళి యూరియా నిలవలను పరిశీలించి ఎప్పటికప్పుడు యూరియాను తెప్పించుకోవాలన్నారు.