రైతన్నకు బాసటగా అన్నదాత పోరు" పోస్టర్లను పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో రైతులకు యూరియా కొరత నేపధ్యంలో వాల్మీకిపురం లోని పార్టీ క్యాంప్ కార్యాలయం నందు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో కలసి "రైతన్నకు బాసటగా అన్నదాత పోరుకు" సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించినట్లు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై వై.యస్.ఆర్.పి రైతు పోరు కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపి కళ్ళు తెరిపిస్తామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.