పీలేరు మండలం పీలేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డెంటల్ సర్జన్ గా పుష్ప మంగళవారం బాధ్యతలు చేపట్టారు.ఈమె చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పదోన్నతి పై వచ్చి పీలేరు వంద పడకల ఏరియా ఆసుపత్రి నందు డిప్యూటీ డెంటల్ సర్జన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇదే ఆస్పత్రి నందు గతంలో 2006 నుండి 2008 వరకు, తర్వాత 2014 నుండి 2023 వరకు దంత వైద్యురాలిగా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పుష్ప ను ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తో పాటు వైద్యులు, నర్సులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.