ప్రభుత్వ గృహాలు మంజూరైన లబ్ధిదారులకు త్వరగా నిర్మాణాలు చేపట్టాలంటే అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజు అన్నారు. శుక్రవారం నరసన్నపేటలోని గడ్డయ్య పేట లే అవుట్ వద్ద లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. సుమారు 527 మంది పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోలేదని వివరించారు. దీని కోసం వెలుగు ద్వారా కూడా రుణాలు అందజేశామన్నారు.