అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం అంతరంగా లో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి స్నానం కోసం పెట్టిన నీటి కడవ ఒక్కసారిగా చిన్నారిపై పడడంతో వీణ వర్షిని అనే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.