కళ్యాణ దుర్గం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో వినాయక పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వినాయక పండుగ ను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు.