చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని నేడు బుధవారం పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల హక్కుల కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. సమాజంలో ఉన్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొని భూస్వాముల అణిచివేతను ప్రతికటించి చరిత్రలో నిలిచారని సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధార్థి పార్థసారథి, డిసిసి ప్