కామారెడ్డి పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ ఎదుట పూల దుకాణదారులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. తక్కువ ధరకు పూల అమ్మకాలు జరుగుతున్న సూపర్ మార్కెట్ వల్ల తమ వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు పూలను విక్రయించడంతో వినియోగదారులు సూపర్ మార్కెట్లను మెరుగ్గా భావిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల తమ అమ్మకాలు తగ్గిపోయినట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు.