భారతదేశ అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కొనియాడారు. బుధవారం సాయంత్రం గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువత నాయకుడు ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు . సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ మహనీయుడు చేసిన కృషి భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.