విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు PDSU ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, విద్యార్థులు పాల్గొన్నారు