ఇధనాలు ఫ్యాక్టరీ పై చిత్తశుద్ధితో ఉన్నామని అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు అన్నారు. అనంతరం ప్రజల జోలికి వస్తే క్షమించేది లేదని అన్నారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాల మధ్య చిచ్చుపెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా అని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు ప్రశ్నించారు. బుధవారం రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయదలచిన ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన తోపులాటలో భాగంగా గాయాలపాలైన పలువురిని గద్వాల ఆసుపత్రిలో ఎమ్మెల్యే విజయుడు పరామర్శించి మాట్లాడారు.