రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో వదిలిపోయిన చెత్త, వ్యర్థాలు ఇప్పటికీ సవాల్‌గా మిగల డం వారు చేసిన నష్టానికి, అరాచక, అడ్డగోలు పాలనకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. చెత్త పన్ను వేసింది కాక మొత్తం 87లక్షల టన్నుల చెత్తను ఎక్కడిక క్కడ కొండల్లా వదిలేసి పోయారని ఏడాదిగా వాటికి పరిష్కారం చూప డానికే శ్రమించాల్సి వస్తోందన్నారు. ఉన్న ఆ చెత్త చాలదన్నట్లు నిత్యం జగన్, వైకాపానేతలు, వారి అవినీతి పుత్రిక సాక్షి, కొన్ని దారి తప్పిన సోషల్ మీడియా ఛానెళ్లు మరింత చెత్త కుమ్మరి స్తూ రాస్తున్నయన్నారు.