యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో జరుగుతున్న యూరియా పంపిణీ ని మండల ప్రత్యేక అధికారి అయిన జిసిసి డివిజనల్ ఆఫీసర్ కె రామారావు స్వయంగా పర్యవేక్షించారు. మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సాలూరు మండలంలోని జీగిరాం, తుండ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలలో జరిగిన యూరియా పంపిణీని సాలూరు తహసిల్దార్ నీలకంఠరావు, ఎంపీడీవో పార్వతి, మండల వ్యవసాయ అధికారి శిరీష తో కలిసి పర్యవేక్షించారు. జీగిరాంలో 139 బస్తాలు, తుండలో 120 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశారు.