రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు వినాయక నవరాత్రుల ఉత్సవాలు పురస్కరించుకొని తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఉత్సవాల భాగంగా ఈనెల 5వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్ పోలీస్ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు స్థానిక తహసిల్దార్ రజనీకుమారి సీఐ వెంకటరాజు గౌడ్ ఎస్సై బాలరాజు మున్సిపల్ కమిషనర్ దేవేందర్ కలిసి పలు చెరువుల ఏర్పాట్లను వారు పరిశీలించారు నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగిందని విద్యుత్ దీపాలు తాగునీటి సౌకర్యం గజాయితగాల్ల ఏర్పాటు చేశామన్నారు