లింగాల మండల పరిధిలోని అబ్బాయి పల్లి శివారులో దట్టమైన నల్లమల అడవిలో గల గిరిజ గుండాల వద్దకు వెళ్లిన ఇద్దరినీ వాగు దాటించి లింగాల ఎస్సై వెంకటేష్ వారి ప్రాణాలను రక్షించిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దకొత్తపల్లి కి చెందిన జంపన్న వెంకటస్వామిలు ఇద్దరూ మూగజీవాలకు పసరుమందు సేకరణ కోసం లింగాల మండ పరిధిలోని అబ్బాయి శివారులో నల్లమల అడవిలోకి వెళ్లారు. దాడి తప్పడంతో విషయం తెలుసుకున్న వెంకటేష్ గౌడ్ అక్కడ చేరుకొని వారిని రక్షించారు.