శుక్రవారం వనపర్తి జిల్లా గణపురం మండలం సల్కలాపురం గ్రామంలోని నూతన గ్రామపంచాయతీ భవనాన్ని వనపర్తి ఎమ్మెల్యే తడి మేఘారెడ్డి ప్రారంభించారు అనంతరం అదే గ్రామంలోని పాఠశాలలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోళ్ల ఫామ్ ను ప్రారంభించారు గణపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.