యువతిపై అత్యా చారయత్నానికి పాల్పడిన వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా రేగిడిలో గురువారం సాయంత్రం జరగగా... కీచక వ్యక్తిని పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పై గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలంలోని ఓ గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి నోట్లో గుడ్డలు కుక్కి దిబ్బ రాము అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. యువతి కేకలు వేయగా అటుగా వెళ్తున్న యువకులు గమనించారు. లోపలకి వెళ్లి అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు.. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామానికి వెళ్లి కీచకుడు రామును అరెస్ట్ చేశారు.