వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, డీజే మైక్ సెట్లకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.