ముత్తుకూరు మండలం లింగాయపాలెం అరుంధతి వాడలో 40 ఏళ్లుగా దొరువు సమస్య ఉందని.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో దొరువును పూడ్చి వేస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అరుంధతి వాడలో జరుగుతున్న పూడ్చివేత కార్యక్రమాన్ని టిడిపి ఐటీ వింగ్ నేత సతీష్ పరిశీలించారు . ఈ సందర్భంగా స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా సన్మానించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి హర్షం వ్యక్తం చేశారు