ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లు జాబితాను కూటమి ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు డైరెక్టర్లను నియమించారు. ముగ్గురు భీమిలి నియోజకవర్గం వాసులు కాగా మధురవాడలో 5,7 వార్డులకు చెందిన చెందిన టిడిపి, బీజేపీ నాయకులు కావటం విశేషం. నాగోతి సూర్య ప్రకాశరావు (టీడీపీ) పోతిన పైడిరాజు(బీజేపీ) నాగోతి అనిత (టీడీపీ )నియమితులయ్యారు. ముగ్గురు డైరెక్టర్లు శనివారం భీమిలి ఎమ్మెల్యే గంటా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.