సెప్టెంబర్ 14న నిర్వహించే లైసెన్స్ సర్వేల సప్లిమెంటరీ పరీక్షను సజావుగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పరీక్ష సజావుగా నిర్వహించేందుకుగాను అధికారులు సమన్వయంతో పని చేయాలని పరీక్ష ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్లాటింగ్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.