జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని, ఆయా వైద్యశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది కర్నె రవి డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ ఏజెన్సీలో ధనార్జనే ధ్యేయంగా కొందరు వైద్యులు దోపిడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ప్రైవేట్ హాస్పటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయన్నారు.