Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల పెన్నా నది ఒడ్డున ఉన్న పరమానంద స్వామి ఆశ్రమం వద్ద దక్షణ కాలువ లీకేజ్ నీటితో రోడ్డు కోతకు గారైంది. దింతో అధికారులు తాత్కాలికంగా డైవర్షన్ మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుండి నెల్లూరుకి వెళ్తుండగా అదుపుతప్పి వెనక టైరు కాలువలోకి దిగిపోయింది. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. బస్సు వెనక భాగం డెబ్బతింది.