కాకినాడజిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో గల జీడిపిక్కల పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పని కల్పించడం న్యాయమంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు..మిగిలిన రోజులు కూడా పని కల్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..వీరికి సీఐటీయూ మండల కార్యదర్శి శ్రీనివాస్ మద్దతు తెలిపారు..యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు