భారతీయ సరుకుల దిగుమతులపై 50 శాతం సుంకాన్ని పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడానికి నిరసిస్తూ రాయదుర్గంలో వామపక్ష నేతలు నిరసన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని వినాయక కూడలిలో శనివారం మద్యాహ్నం ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు మల్లికార్జున, సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున పాల్గొన్నారు.