కోతుల భారీ నుంచి ప్రజలు, పంట పొలాలను కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఏటూరునాగారంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి దావూద్ మాట్లాడుతూ.. కోతుల సమస్యతో అనేక ఏళ్లుగా ప్రజలు, చిరు వ్యాపారులు, స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లపై వెళ్తున్న వారిపై దాడిచేసి గాయపరుస్తున్నాయన్నారు. గ్రామపంచాయతీ, అటవీశాఖ కోతుల.నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.