రోకటి సురేష్ జీవితం ఆదర్శవంతం. రాజకీయాలకు అతీతం గా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేసిన రోకటి సురేష్ జీవితం ఆదర్శవంతమైందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొత్తగూడం ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్ సోమవారం మృతి చెందగా ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ,ఆదర్శవంతమైన రాజకీయ జీవితాన్ని కొనసాగించి,పేద ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారూ