ప్రస్తుత వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నందున ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు సమయానికి పరీక్షలు చేసి, తక్షణ చికిత్స అందించాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలు, రోగుల భద్రత వంటి అంశాలను విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని, పేషెంట్ల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మెడిసిన్, పీడియాట్రిక్స