రాఖీ పండుగ సందర్భంగా ఏటూరునాగారం RTC బస్టాండు శనివారం ఉదయం నుంచి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాలకు తరలివెల్లే ప్రయాణికులు వందల సంఖ్యలో బస్టాండుకు చేరుకోవడంతో రద్దీగా మారింది. సరిపడా బస్సులు లేకపోవడంతో వచ్చిన ఒక్క బస్సు కోసం కుస్తీలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎండలు కొడుతుండటంతో బస్టాండులో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు.