సికింద్రాబాద్ లోని మారేడుపల్లి లోని నాగమ్మ దేవత ఆలయంలో బోనాల వేడుకలలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి బోనాల వేడుకలు ప్రతికలుగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోనాల వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు.