మంత్రి ఎస్. సవిత గురువారం రొద్దం మండలం పి రొప్పాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, రంగులరెడ్డికి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని అన్నారు. గత పాలకులు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు చూసి పిచ్చి పడుతోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పెన్షన్లను 200 నుండి 1000 రూపాయలకు పెంచిన ఘనత టీడీపీదే అని తెలిపారు.