యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య ,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.