రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను రాచకొండ సి పి సుధీర్ బాబు శనివారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎన్నో సవాలతో కూడుకున్నదని విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీస్ శాఖలో సమర్థవంతంగా క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవి విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని సూచించారు.