తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడ పోటీలు శుక్రవారం జరిగాయి. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ పోటీల్లో ట్రైని టాట్స్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఎనిమిది వందల మీటర్ల పరుగు పోటీలో మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ పోటీలో కూడా మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. దీంతో విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ ధనుంజయ రెడ్డి, పీఈటి జోహార, సురేష్ ఉపాధ్యాయులు అభినందించారు. సత్తా చాటిన విద్యార్థులకు సాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.