ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రఫీ మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కేంద్రంగా ఉన్న మార్కాపురం లో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని 3పి పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లను బదిలీ చేయడానికి వ్యతిరేకించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల కొరత మందుల కొరతతో వైద్యం పేదలకు అందుబాటులో ఉండడం లేదన్నారు.