తిరుమల శ్రీవారిని ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణిందర్ జిత్ బిట్టా బుధవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల్లో చాలా కష్టాలు భరించి దేశ రక్షణలో ఉన్న జవాన్లు క్షేమంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని ప్రతి ఒక్కరు దేశం కోసం అంకితభావంతో పనిచేయాలని అన్నారు.