మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండలం చౌదర్పల్లి గ్రామ రైతులు సోమవారం సబ్ స్టేషన్ ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని సకాలంలో కరెంటు లేకపోవడంతో తీవ్ర నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను పరిష్కరించేంతవరకు కదిలేది లేదని రైతు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఎస్ఐ పోచయ్య జోక్యం చేసుకొని ఏఈ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.