జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండల కేంద్రంలో తహసిల్దార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మంచాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు సూకురు అప్పలస్వామి మాట్లాడుతూ ఐటీడీఏలో నూటికి నూరు శాతం ఉద్యోగాలను గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. గిరిజన కార్పొరేషన్ను బలోపేతం చేయాలన్నారు.