పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కలికిరి మండలం గుండ్లూరు గ్రామం నాయికవారి పల్లి నందు కీ. శే.జంగేటి చిన్న వెంకట్రమణ దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కలికిరి మండలం చీకటిపల్లి నందు గ్రామ వైకాపా నాయకులను మరియు కార్యకర్తలను కలుసుకున్నారు. అదేవిధంగా కలికిరి మండలం చీకటిపల్లి నందు మాజీ సర్పంచ్ కీ. శే చిన్నక్కగారి రాజారెడ్డి దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.