ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల్లో ఆయుధ డిపో మాకొద్దు అంటూ గ్రామల్లో శుక్రవారం గిరిజనులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వంకావారిగూడెం పంచాయితిలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేయవద్దని ఇవాళ నిరసన చేశారు. గత మూడేళ్లుగా జరిగిన గ్రామ సభల్లో ఏకగ్రీవంగా వ్యతిరేక తీర్మనాలు చేసినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు, పోగొండ జలాశయం ముంపు నిర్వాసితులకు న్యాయం జరగలేదని వాపోయారు.