కంబదూరు మండలం చెన్నేపల్లి గ్రామానికి చెందిన రామ మోహన్ కుమారుడు సురేంద్ర బుధవారం బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందాడు. సురేంద్ర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడో తెలియడం లేదు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.