దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ లోని దుర్గామాత ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.