ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పి.గన్నవరం అక్విడెక్టు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆదివారం పి. గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అల్లవరం మండలాల్లోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశుగ్రాసం, కూరగాయల తోటలు ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.